- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! బస్సు - వ్యాన్ ఢీకొని ఆరుగురు మహిళలు దుర్మరణం. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు.

దిశ, వెబ్ డెస్క్: ఒక ప్రైవేటు బస్సు అతివేగంతో వచ్చి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టంది. దీంతో వ్యాన్ లో ఉన్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకోగా.. తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్ పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో చిక్కుకున్న బాధితులను బయటకు తీయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరణించిన మహిళలంతా వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్న పోలీసులు, బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణాల్లో అజాగ్రత్త ఆరుగురి నిండు ప్రాణాలను బలి తీసుకోవడం ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది.






