- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులు.. నష్టపరిహారం చెల్లించాలని వినతి
బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతులు సాగు చేసిన తేజస్విని రకం సోయాబీన్ విత్తనాలు సరిగా మొలకెత్తక పోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, బజార్‌హత్నూర్: బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతులు సాగు చేసిన తేజస్విని రకం సోయాబీన్ విత్తనాలు సరిగా మొలకెత్తక పోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పెట్టుబడులు పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి విత్తినప్పటికీ ఆశించిన స్థాయిలో మొలకలు రాకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. నాసిరకం విత్తనాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని ఆరోపించిన రైతులు, సంబంధిత విత్తనాల కంపెనీ పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం బజార్‌హత్నూర్ ఎమ్మార్వో శ్యామ్ సుందర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతులు తోకల విఠల్, చంద్రశేఖర్, ప్రభాకర్, సంజీవ్, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.






