ఎక్స్‌పీరియం ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావుపై రైతుల సంచలన ఆరోపణలు

by Malleboina Mahesh |

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు పై రైతుల సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ఎక్స్‌పీరియం ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావుపై రైతుల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్స్‌పీరియం ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు పై రైతుల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ 'ఎక్స్‌పీరియం ఎకో పార్క్' (Experium Eco Park)ను ఇటీవల తెలంగాణ సీఎం, చిరంజీవితో పాటు ప్రముఖులు పాల్గోని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీని యజమాని రాందేవ్ రావుపై స్థానిక రైతులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము ఐదేళ్ల కాల పరిమితికి అని భూమిని లీజుకు ఇస్తే, తమను నమ్మించి ఏకంగా 99 సంవత్సరాలకు లీజు పత్రాలు రాసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఒప్పందం ప్రకారం లీజు పత్రాలు కానీ, రావాల్సిన నగదు కానీ ఇవ్వకుండా తమను గన్‌తో బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ భూమిని తమకు ఇప్పించాలని, లేనిపక్షంలో రాందేవ్ రావు పేరు రాసి తామంతా సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. దాదాపు 150 నుంచి 250 ఎకరాల విస్తీర్ణంలో భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఎకో పార్కును గత ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రం వెనుక భారీగా భూ అక్రమాలు జరిగాయని రైతులు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు ఎలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story