- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ రెడ్డి ఫాంహౌస్ ఘటన... పోలీసుల అదుపులో ఎంపీ?
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ ఘటన తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడటం అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫాంహౌస్ లోపల గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరగడం పెను ఉత్కంఠకు దారితీసింది. గన్ ఫైరింగ్‌తో స్థానికులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు ఫాంహౌస్‌ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టి, లోపల ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎంపీ అరెస్ట్?
ఈ డ్రగ్స్ పార్టీలో కేవలం స్థానికులే కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీకి చెందిన ఒక ఎంపీ, జైపూర్‌కు చెందిన ఎమ్మెల్యే ఈ పార్టీలో పాల్గొన్నట్లు.. వారు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను, సీసీటీవీ ఫుటేజీని సేకరించి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? కాల్పులు జరపడానికి గల కారణం ఏమిటి? అనే కోణంలో విచారణ సాగుతోందని వార్తలు వినవస్తున్నాయి.






