రోహిత్ శర్మ ₹3.25 కోట్ల వాచ్‌ని లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమానులు

by Malleboina Mahesh |

ముంబైలో రోహిత్ శర్మ కారులో వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆయన ఖరీదైన వాచ్‌ని లాక్కోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రోహిత్ కారు అద్దం మూసివేసి ప్రమాదం నుండి బయటపడ్డారు.

రోహిత్ శర్మ ₹3.25 కోట్ల వాచ్‌ని లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ముంబై వీధుల్లో చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ శర్మ తన ఖరీదైన కారులో ప్రయాణిస్తుండగా, ట్రాఫిక్ వద్ద ఆగిన సమయంలో కొందరు అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ చేతికి ఉన్న సుమారు ₹3.25 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన "జిరాఫీ" (Girard-Perregaux) వాచ్‌ని గమనించిన కొందరు వ్యక్తులు, రోహత్ తన అభిమానులకు అభివాదం చేశారు. ఇది గమనించిన కొందరు రోహిత్ చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ని లాక్కోవడానికి ప్రయత్నించారు.

అప్రమత్తమైన రోహిత్ శర్మ.. దుండగుల ప్రయత్నాన్ని గమనించి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు వాచ్‌ని తాకేలోపే ఆయన వెంటనే కారు అద్దాన్ని మూసివేసి అక్కడ నుండి ముందుకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఘటనతో సెలబ్రిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు, పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Next Story