పుట్టిన రోజు సందర్భంగా గిరిజన పిల్లలకు అన్నదానం చేసిన ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్ట్

by Manoj |   (  Updated:2022-03-16 04:53:21  IST  )

దిశ, సత్తుపల్లి టౌన్: ప్రముఖ జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్ట్ హరి అలియాస్ హరిత పుట్టినరోజు..latest telugu news

పుట్టిన రోజు సందర్భంగా గిరిజన పిల్లలకు అన్నదానం చేసిన ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్ట్
X

దిశ, సత్తుపల్లి టౌన్: ప్రముఖ జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్ట్ హరి అలియాస్ హరిత పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు జబర్దస్త్ ఆర్టిస్ట్ హరిత స్వయంగా భోజనాలు వడ్డించారు.

ఈ ప్రాంతంలో ఉన్న ఈ గిరిపుత్రుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నిజంగా నా అదృష్టం, ఏమి పెట్టి కొనుక్కున్న ఈ ఆనందం దొరకదని, చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్కే ఫౌండేషన్ అధినేత రాధాకృష్ణ మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చి గ్రామానికి చెందిన గిరిజనులందరికీ భోజనం పెట్టడం తనకున్న దాయగుణానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, రాజు,సాయి,రామకృష్ణ, మౌనిక,వరలక్ష్మి, సైదేశ్వరి పాల్గొన్నారు.

Next Story