- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజంగానే ఈ ఫిబ్రవరికి మహిమలు ఉన్నాయా?
2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. 823 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి ఫిబ్రవరి నెల వస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : "2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. 823 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి ఫిబ్రవరి నెల వస్తుంది. ఈనెలలో పనులు చేపడితే ఇక అంతా శుభమే, లాభమే. ఈనెలలో పుట్టినవాళ్లకు రాజయోగం, అదృష్ట జాతకం.." అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్న పోస్టులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఈ పోస్టు చూసి చాలా మంది నిజమే అనుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఇదొక తప్పుడు ప్రచారం. 2026 ఫిబ్రవరి నెలలో ఎలాంటి అరుదైన అద్భుతం జరగడం లేదు. ఇది ఒక సాధారణ ఫిబ్రవరి నెల మాత్రమే. 2026 లీప్ ఇయర్ కాదు, కాబట్టి ఫిబ్రవరికి 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడం వల్ల ఆ నెలలో ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి వారం ఒకే విధంగా నాలుగు సార్లు వస్తాయి. ఇది చాలా సంవత్సరాల్లో ఇప్పటికే జరిగింది.
సోషల్ మీడియాలో చెబుతున్నట్టు "నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు ఉంటే అది చాలా అరుదైన విషయం" అనేది అరుదైన విషయం కాదు. నాన్-లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి ఆదివారం మొదలైతే ఇలా ఉండటం చాలా సహజం. ఇలాంటి ఫిబ్రవరి నెలలు గతంలో 2015, 2009, 2003, 1998 వంటి సంవత్సరాల్లో కూడా వచ్చాయి. భవిష్యత్తులో కూడా తరచూ వస్తాయి. దీనికి వందల ఏళ్లతో గానీ, 823 ఏళ్లతో గానీ, మహిమలు, శక్తులతో గాని ఎలాంటి సంబంధం లేదు.
కాబట్టి 2026 ఫిబ్రవరి నెల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నిజం కావు. క్యాలెండర్ లెక్కలు సరిగా తెలియక లేదా కావాలనే సంచలనం కోసం ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పోస్టులు చూసినప్పుడు గుడ్డిగా నమ్మి, నలుగురికి చేరవేసే ముందు, ఒకసారి అవి నిజమా కాదా అని పరిశీలించాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం.






