నకిలీ ఉద్యోగాల కుంభకోణం: ఆరు రాష్ట్రాల్లో ఈడీ ముమ్మర దాడులు..15 చోట్ల సోదాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 06:36:07  IST  )

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

నకిలీ ఉద్యోగాల కుంభకోణం: ఆరు రాష్ట్రాల్లో ఈడీ ముమ్మర దాడులు..15 చోట్ల సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ (Money laundering) విచారణలో భాగంగా గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బీహార్‌లో మూడు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, కేరళలో నాలుగు, తమిళనాడులో ఒకటి, గుజరాత్‌లో ఒకటి, ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.

నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో మళ్లించిన (మనీ లాండరింగ్) ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యవస్థీకృత నేర ముఠా (Organised Gang) నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కోట్లు గడించిన సూత్రధారుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది.


Read More..

11 లక్షల మందికిపైగా ఉద్యోగాలు..! ఐటీ రంగంలో ఇమేజ్ 2.0 పాలసీల ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు

Next Story