- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మెరుపు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా నిరుద్యోగులు హైదరాబాద్‌లో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల (Job Notifications) కోసం మెరుపు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా నిరుద్యోగులు (unemployed) హైదరాబాద్‌లో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ (Job calendar)ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల భారీ ఆందోళనలో భాగంగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'మహా ధర్నా' చేపట్టాలని వారు నిర్ణయించారు. తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున తరలి రావాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తం అయిన పోలీస్ శాఖ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ (Chikkadapalli Central Library) ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం లోకి వెళ్లింది.
అయితే ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనను భగ్నం చేసేందుకు చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads) పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. నిరసనకారులు ర్యాలీగా బయలుదేరకుండా ఎక్కడికక్కడ వారిని నిర్బంధించేందుకు (House Arrests/Detentions) పోలీసులు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో స్థానిక ప్రజలు ఏ క్షణం ఎమ్ జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలోనే నిరుద్యోగులు చేసిన ధర్నాల సమయంలో లాఠీ ఛార్జ్ చూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాడు. తాజాగా అవే పరిస్థితులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ప్రాంతంలో నెలకొనడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.






