- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSLV- C 62 రాకెట్ ప్రయోగంలో ఉత్కంఠ.. నాలుగో దశలో శాటిలైట్‌తో తెగిన సంబంధాలు
ఇస్రో ఖాతాల్లో మరో విజయం చేరింది. పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

దిశ, వెబ్‌డెస్క్: పీఎస్‌ఎల్‌వీ - సీ62 (PSLV- C 62) రాకెట్ సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం సరిగ్గా 10.18కి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రయోగం 18 నిమిషాల లోపే ముగియాల్సి ఉండగా నాలుగో దశ ప్రారంభంలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఏం జరగుతుందోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్న ఇస్రో చైర్మన్ వి.నారాయణ్ కీలక ప్రకటన చేశారు. పీఎస్‌ఎల్‌వీ - సీ 62 రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని ప్రకటించారు. మూడు దశల్లో సక్సెస్ అయ్యామని, నాలుగో దశలో సాంకేతిక సమస్యపై విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే, దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన 1,485 కేజీల బరువు ఉన్న ‘ఈఓఎస్-ఎన్1’ (EOS-N1) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు. ఈ పీఎస్ఎల్‌వీ - సీ 62తో పాటు భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ ఇతర దేశాలకు చెందిన 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ రాకెట్‌లో ఉన్నాయి. ‘అన్వేష ఈఓఎస్-ఎన్1’ (Anvesha EOS-N1) ప్రధానంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) వ్యూహాత్మక అవసరాల కోసం రూపొందించారు. ఇది ఒక హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను కనిపెట్టడం (Surveillance), వ్యవసాయం, విపత్తు నిర్వహణ, భూగర్భ వనరుల గుర్తింపులో ఇది కీలక సమాచారాన్ని అందజేయనుంది.






