జోరుగా ప్రభుత్వ భూముల్లో మట్టి తొవ్వకాలు.. నిర్లక్ష్యంగా అధికారులు!

by Disha Web Desk 13 |
జోరుగా ప్రభుత్వ భూముల్లో మట్టి తొవ్వకాలు.. నిర్లక్ష్యంగా అధికారులు!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే లేఅవుట్‌లో.. ఇంటి నిర్మాణంలోకి మట్టి అవసరం ఉంటుంది. ఆ మట్టిని తరలించాలంటే స్థానిక మండల రెవెన్యూ అధికారి అనుమతితో తీసుకెళ్లాలి. కానీ అధికారులతో మట్టి తరలించే వ్యాపారులు కుమ్మక్కై ఇష్టానుసారంగా మట్టిన తరలించుకపోతున్నారు. దీంతో అధికారికంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. ఒక ట్రిప్పు మట్టి వేలల్లో తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిలో ఎర్ర మట్టిని ఇష్టా రాజ్యంగా తవ్వేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో తరలిస్తూ.. అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా మట్టిని తోడేస్తూ విక్రయిస్తున్నా.. అధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.

చేగూరు శివారులోని సర్వే నెంబర్ 213 లో పీర్ల ఏను దగ్గర ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఎత్తయిన ప్రాంతం కావడం.. అందులోనూ ఎర్రనేల ఉండటంతో అక్రమార్కుల కన్ను ఆ ప్రభుత్వ భూమిపై పడింది. ఇంకేముందు రూ.కోట్ల విలువ చేసే మట్టిని కొల్లగొడుతున్నారు. మహేశ్వరం మండలంలోని లాసూలూర్ గ్రామంలో ప్రభుత్వంలోనే రియల్ వ్యాపారులు వెంచర్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు. అబ్ధుల్లాపూర్ మెట్ మండలం పరిధిలోని రామోజీ ఫిల్మీం సిటీ సమీపంలోనున్న ప్రభుత్వ భూమిలోని ఎర్రమట్టిని జోరుగా తరలించి వ్యాపారం చేసుకుంటున్నారు.

నిబంధనలకు విరుద్దంగా..


స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఎర్రమట్టి వ్యాపారులు నగర శివారులో ఉన్న ప్రభుత్వ భూముల నుంచి తీసుకొచ్చి పట్నంలో వ్యాపారం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి తవ్వకాలు చేస్తున్నారు. సుమారు 30, 40 ఫీట్ల లోతు వరకు ఇష్టానుసారంగా తవ్వేస్తూ.. జోరుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. టిప్పర్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తూ.. అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నా ప్రభుత్వ నిబంధన ఎవరూ నోరు మెదపకపోవడం అనుమానాలకు చోద్యం చూస్తున్న అధికారులు బలం చేకూరుస్తోంది.



Next Story

Most Viewed