సెలబ్రిటీలు యాడ్స్‌కు ఒప్పుకునే ముందు బాధ్యతగా వ్యవహరించాలి: సుప్రీంకోర్టు

by Harish |
సెలబ్రిటీలు యాడ్స్‌కు ఒప్పుకునే ముందు బాధ్యతగా వ్యవహరించాలి: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మొదలుగు వారు ఉత్పత్తుల ప్రకటనలకు ఒప్పుకునే విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని, తప్పు దోవ పట్టించే ప్రకటనల పరంగా బాధ్యతగా ఉండాలని మంగళవారం సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఉత్పత్తుల గురించి పూర్తిగా అవగాహన లేకుండా తప్పుడు ప్రకటనలకు ఆమోదం తెలపడం వల్ల ఆ ప్రభావం చాలా దూరం వెళ్తుందని వారు గమనించాలని కోర్టు సూచించింది. అలాగే ఇప్పటి వరకు ఆహార రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను మే 7న కోర్టు ఆదేశించింది.

ప్రకటనలకు ఒప్పుకునే ముందు సెలబ్రిటీలు మొదలగువారు ముందుగా వాటి గురించి తెలుసుకోవాలి. వారు బాధ్యత వహిస్తూ బాధ్యతతో వ్యవహరించడం చాలా ముఖ్యం అని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. ఇటీవల యోగా గురువు రామ్‌దేవ్ మద్దతు కలిగిన పతంజలి ఆయుర్వేదం తన మందులు, ఉత్పత్తుల ద్వారా మధుమేహం వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్న పతంజలి ఆయుర్వేద ప్రకటనలపై కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చారు.

ప్రకటనదారు కేబుల్ టెలివిజన్ రూల్స్, 1994 ప్రకారం స్వీయ-డిక్లరేషన్ ఇవ్వాలని, ఆ తరువాత మాత్రమే ప్రకటనలు చూపించాలని కోర్టు పేర్కొంది. తప్పుదారి పట్టించే ప్రకటనలు పిల్లలు, సీనియర్ సిటిజన్‌లను నేరుగా ప్రభావితం చేస్తాయని, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కంపెనీల ద్వారా తప్పుదారి పట్టించే యాడ్‌లను పరిశీలిస్తామని ఏప్రిల్ 23న కోర్టు తెలిపింది. తాజాగా మంగళవారం విచారణ జరిపిన కోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.

Next Story

Most Viewed