- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. నెట్టింట జోరందుకున్న విడాకుల వార్తలు!
దిశ, సినిమా: ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ జీవితకాలం వారితో ఉండలేక మధ్యలోనే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కొందరు అయితే పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతూ మరో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం అలాగే ఒంటరిగా ఉండిపోతున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె చేరినట్లు సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దానికి కారణం రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీపికతో కలిసి ఉన్న ఫొటోలు ఉన్నప్పటికీ పెళ్లి ఫొటోలు మాత్రం కనిపించడం లేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అసలు ఏమైంది వీరిద్దరు మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారా? లేక పొరపాటు వల్ల ఫొటోలు డిలీట్ అయ్యాయా? అని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం దీపిక ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అసలు పెళ్లి ఫొటోలు కనిపించకపోవడానికి కారణం ఏంటో? తెలియాలంటే రణ్‌వీర్ స్పందించి క్లారిటీ ఇస్తే కానీ అభిమానులు కుదుటపడేలా లేరు.