నోరు జారిన సీఎం జగన్ మేనమామ..ఏమన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Mamatha |
నోరు జారిన సీఎం జగన్ మేనమామ..ఏమన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, తిరుమల: సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నోరు జారారు. ఏపీని గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాలుక కరుచుకున్నారు. ఆదివారం ఉదయం రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. సైలెంట్ ఓటింగ్ ఏ విధంగా ఉందో 4వ తేదీ మధ్యాహ్నం ప్రపంచానికి, టీడీపీకి తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం శూన్యమనీ, వైఎస్ షర్మిల పోటీ చేసినా అవినాష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలుజేసిందని విమర్శిస్తున్న క్రమంలో మాట తూలారు. ఏపీని గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటూ మాటను సరి చేసుకున్నారు.

Next Story