పినపాకలో జోరు వాన

by Sridhar Babu |
పినపాకలో జోరు వాన
X

దిశ,మణుగూరు : పినపాకలో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడ్డాయి. ఆదివారం సాయంత్రం నియోజకవర్గంలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించాయి. కొన్ని చోట్ల ఇండ్లలోకి భారీగా నీరు చేరాయి. మణుగూరు పట్టణంలోని సీఎస్పీ ఏరియాలో ఇండ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు. దీనికి తోడు విద్యుత్‌ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. అంతేగాక పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించింది. వర్షంతో కూడిన ఈదురుగాలతో వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story