- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరుకే చెరువులు కుంటల తవ్వకాలు
అభివృద్ధి మాటున అక్రమ సంపాదనకు మణుగూరు కేంద్ర బిందువుగా మారింది.

దిశ, మణుగూరు: అభివృద్ధి మాటున అక్రమ సంపాదనకు మణుగూరు కేంద్ర బిందువుగా మారింది. మేము ఏమైనా చేస్తాం.. మాకు అడ్డు చెప్పే వారే లేరు అంటూ దూసుకు పోతున్న మట్టి తోలకాల ముఠా నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో అక్రమ మట్టి తోలకాల రోజు రోజుకు పెరిగిపోతుంది. చెరువులు, కుంటల అభివృద్ధి పేరుతో మట్టి తోలకాల దందా మూడు జేసీబీ లు ఆరు ట్రక్కులుగా కొనసాగుతోంది. చెరువులు, కుంటల అభివృద్ధి పేరు చెప్పి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మణుగూరులో కొందరూ ఒక ముఠాగా ఏర్పడి మట్టి దందాను కొనసాగిస్తున్నారు. ఎక్కడ మట్టి తవ్వకాలు జరిగినా వీరి పేరే వినిపిస్తుంది. అసలు చెరువులు, కుంటల్లో తవ్విన మట్టి ఎటు పోతుందో అర్ధం కాని పరిస్థితి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టిని గల్లీల్లో నుండి తరలిస్తూ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్ళు ట్రాక్టర్ల శబ్దాలతో ప్రజలు నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దందాకు అధికార పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉన్నాయి. మట్టి తోలకం దారులను మట్టి ఎక్కడికి తోలుతున్నారని ప్రశ్నిస్తే మా ఇష్టం పూడికలు తీయవద్దా అంటూ సమాధానాలు చెబుతున్నారు. మేము పర్మిషన్లతోనే మట్టింతోలకాలు జరుపుతున్నాం అంటూ బహిరంగంగానే అంటున్నారు. ఎటువంటి లైసెన్స్ లేని మైనర్లతో ట్రాక్టర్లను నడిపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఈ దందాను అడ్డుకునేందుకు అధికారులను సైతం జోక్యం చేసుకొనివ్వ కుండా కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఈ విధంగా అధికార పార్టీ నాయకుల హవా కొనసాగుతోంది. ఈ దందాకు చెక్ పెడతారో లేక దందాను మరింతగా పెంచి జేబులు నింపుకుంటారో చూడాల్సిందే.






