Niharika Konidela: నిహారికకు బిగ్ షాక్ ఇచ్చిన మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య.. రివేంజ్ మామూలుగా లేదుగా?

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-08 02:08:08  IST  )

సినీ ఇండస్ట్రీ(Film Industry)లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు(divorce) తీసుకుని విడిపోతున్నారు.

Niharika Konidela: నిహారికకు బిగ్ షాక్ ఇచ్చిన మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య.. రివేంజ్ మామూలుగా లేదుగా?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీ(Film Industry)లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు(divorce) తీసుకుని విడిపోతున్నారు. ఇక విడిపోయినవారు రెండో పెళ్లి (second marriage)చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే నాగచైతన్య(Naga Chaitanya), సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా మెగా డాటర్ నిహారిక(Niharika Konidela), జొన్నలగడ్డ చైతన్య గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు.

కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలువలేదు. దీంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక నిహారిక(Niharika Konidela) డైవర్స్ తర్వాత నుంచి సినిమాలు తెరకెక్కించడంతో పాటు, హీరోయిన్‌గా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. చైతన్య విషయానికొస్తే.. జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగా డాటర్ నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya) కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అది కూడా నిహారిక క్లోజ్ ఫ్రెండ్‌నే అని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిహారికకు జొన్నలగడ్డ చైతన్య బిగ్ షాక్ ఇచ్చినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రివేంజ్ మామూలుగా లేదని చర్చించుకుంటున్నారు.

గమనిక: పై వార్త సోషల్ మీడియా ఆధారంగా తీసుకోబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు.


Read More..

Sobhita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న శోభిత ధూళిపాళ కట్నం ఎంత తీసుకెళ్తుందంటే?

Amaran Movie: తెలుగులో కూడా దూసుకెళ్తున్న " అమరన్ " మూవీ

Next Story