ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలి.. ప్రధాని మోదీ పిలుపు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-25 05:19:28  IST  )

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్(twitter)ద్వారా దేశ పౌరులకు కీలక సందేశాన్ని ఇచ్చారు.

ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలి.. ప్రధాని మోదీ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters' Day) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్(twitter)ద్వారా దేశ పౌరులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు రాసిన లేఖలో భారత ప్రజాస్వామ్య విశిష్టతను కొనియాడారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాకుండా, 'ప్రజాస్వామ్యానికి తల్లి' వంటిదని, మన నాగరికతలో చర్చలు, సంవాదాలు అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు. 1951లో ప్రారంభమైన మొదటి సాధారణ ఎన్నికల నుంచి నేటి వరకు మన దేశం 75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ఘనంగా పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi) గుర్తుచేశారు.

అలాగే ఓటు వేయడం అనేది ఒక పవిత్రమైన హక్కు, దేశ భవిష్యత్తును నిర్ణయించే గొప్ప బాధ్యత అని ప్రధాని ఉద్ఘాటించారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు పొందుతున్న యువతను "భాగ్య విధాత"గా అభివర్ణిస్తూ, వారి భాగస్వామ్యం దేశాన్ని శక్తివంతంగా మారుస్తుందని ఆకాంక్షించారు. విద్యాసంస్థలు ఓటరు నమోదు కేంద్రాలు గా మారి, ప్రతి అర్హత కలిగిన యువకుడిని ఓటరుగా చేర్పించాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా, దేశాభివృద్ధిలో 'నారీ శక్తి'యువతుల క్రియాశీలక పాత్ర ఎంతో కీలకమని మోడీ స్పష్టం చేశారు. 'మేరా యువ భారత్' (MY Bharat) వేదిక ద్వారా యువత సామాజిక బాధ్యతతో మెలిగి, స్వయం సమృద్ధ, అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు.

Next Story