- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోండి: ప్రధాని మోడీ పిలుపు
తమిళనాడు మరియు బెంగాల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఓటర్లకు సందేశం ఇచ్చారు. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజు (ఏప్రిల్ 23, 2026) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఒక పవిత్రమైన కర్తవ్యమని, ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. ముఖ్యంగా తమిళనాడులోని యువత, మహిళలు రికార్డు స్థాయిలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, పశ్చిమ బెంగాల్‌లో నేడు తొలి విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల ఓటర్లను ఉద్దేశించి కూడా మోడీ సందేశం పంపారు. బెంగాలీ ప్రజలందరూ పూర్తి బలంతో ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తన యువ మిత్రులు, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాలని ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.






