- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

దిశ, పెగడపల్లి : కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఇటీవల ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బుర్ర రాములు గౌడ్, కార్యదర్శిగా ఎంపికైన సతీష్ రెడ్డిని మంత్రి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
పదవులు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారీ తిరుపతి, నాయకులు ఓరుగలి శ్రీనివాస్, సంధి మల్లారెడ్డి, పూసల తిరుపతి, బండారి శ్రీనివాస్, రవి నాయక్, చెట్ల కిషన్, చాట్ల విజయ్ భాస్కర్, తడగొండ రాజు, నిరటి రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.






