ప్రతి అర్హుడి ఓటును పరిరక్షించాలి : ఎమ్మెల్యే బాలు నాయక్

by Batti.Sumithra |

చింతపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత హాజరై దిశానిర్దేశం చేశారు.

ప్రతి అర్హుడి ఓటును పరిరక్షించాలి : ఎమ్మెల్యే బాలు నాయక్
X

దిశ, చింతపల్లి : చింతపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ (SIR) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొని, ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు సక్రమంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు. బీఎల్‌ఓలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, ప్రతి బూత్‌లోని ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఓటరు పేరు కూడా అనవసరంగా తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఓటర్ల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ బూత్ పరిధిలోని పార్టీ మద్దతుదారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, వారి ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను నిర్మించి, ప్రతి ఓటరుని చైతన్యపరిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

ప్రజల మద్దతుతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత బలంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జటావత్ హరి నాయక్, మాజీ ఎంపీపీలు కొండూరు భవాని పవన్ కుమార్, రవి నాయక్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, మాజీ జడ్పీటీసీలు జంగిటి నర్సింహా, మాస భాస్కర్, మాజీ ఎంపీటీసీ ఎరుకల వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్ నాయక్, సర్పంచ్‌లు కసారపు శ్వేత శ్రీనివాస్, యాచారం యాదిగౌడ్, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story