కీలక కమిటీని ప్రకటించిన బండి.. ఈటల, అర్వింద్​లకు ప్రాధాన్యం

by Disha Web Desk |
కీలక కమిటీని ప్రకటించిన బండి.. ఈటల, అర్వింద్​లకు ప్రాధాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అప్పగించారు. ఈమేరకు కమిటీ కన్వీనర్ గా ఆయనను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కమిటీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఉన్నారు.

ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ గా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డిని నియమించారు. కాగా గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, యోగానంద్ కు కమిటీలో చోటు కల్పించారు.

ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కన్వీనర్ గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బాబీ అజ్మీరకు అవకాశం కల్పించారు.


Next Story