సరీసృపాలతో సాహసం.. భయంతో చచ్చిపోతామంటున్న స్టార్స్

by GSrikanth |

దిశ, సినిమా: ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి 12’ సీజన్ భయంకరంగా కొనసాగుతుంది.

సరీసృపాలతో సాహసం.. భయంతో చచ్చిపోతామంటున్న స్టార్స్
X

దిశ, సినిమా: ప్రముఖ హిందీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడి 12' సీజన్ భయంకరంగా కొనసాగుతుంది. రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ ఎరికా ప్యాకర్డ్ ఇదే విషయాన్ని చెబుతూ ఓ ఇంటర్వ్యూలో షో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో పాల్గొన్న సెలబ్రిటీలు ప్రతీ టాస్క్‌లో భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. పాములు, మొసళ్లు మొదలైన సరీసృపాలతో సాహసాలు ఒళ్లు గగుర్లు పొడ్చేలా చేస్తున్నాయని చెప్పింది. తాను కూడా ముగ్గురు పోటీదారులతో గాజు పెట్టెలో ఇరుక్కుని ఇబ్బందికి గురయ్యానన్న నటి.. బరువెక్కిన హృదయంతోనే షోకు వీడ్కోలు పలికినట్లు తెలిపింది. ఇక ఈ అపురూపమైన సాహసయాత్రను ఇంత త్వరగా ముగించడం బాధ కలిగించిందన్న ఎరికా.. ఈ షోలో నేర్చుకున్న పాఠాలు, జ్ఞాపకాలను జీవితాంతం భద్రపరుచుకుంటానని చెప్పింది.

Next Story