ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు.. 17 ఏళ్ల క్రితం ఎలైట్ పార్టీలో మనుషులను తిన్నట్లు మోడల్ చేసిన ఆరోపణలు నిజమేనా?

by Malleboina Mahesh |

2009 నాటి మెక్సికన్ మోడల్ గబ్రియేలా రికో జిమెనెజ్ (Gabriela Rico Jiménez).. ఇక్కడ మనుషులను తింటున్నారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు.. 17 ఏళ్ల క్రితం ఎలైట్ పార్టీలో మనుషులను తిన్నట్లు మోడల్ చేసిన ఆరోపణలు నిజమేనా?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాకు చెందిన జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)కు సంబంధించిన మెయిల్స్ లీక్ అవ్వడంలో అందులో వేలాది అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉండటం సంచలనంగా మారింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ (Epstein Files) పై తీవ్ర చర్చ జరుగుతోంది. అతని మెయిల్స్‌లో ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి. అయితే, ఈ పత్రాలు విడుదలైన తరుణంలో 2009 నాటి మెక్సికన్ మోడల్ గబ్రియేలా రికో జిమెనెజ్ (Gabriela Rico Jiménez).. ఇక్కడ మనుషులను తింటున్నారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

అసలు ఆ రాత్రి ఏం జరిగింది.. ఆ వీడియోలో ఏముంది..?

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపణల నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న మెక్సికన్ మోడల్ గబ్రియేలా రికో(Mexican model Gabriela Rico) వీడియోలోని సంఘటన 2009 ఆగస్టులో చోటు చేసుకుంది. ఆ వీడియోలో 21 ఏళ్ల గాబ్రియేలా మెక్సికోలోని ఒక హోటల్ వెలుపల తీవ్ర భయాందోళనలతో కేకలు వేస్తూ కనిపించింది. ఆమె బిగ్గరగా అరుస్తూ.. లోపల "వారు మనుషులను తిన్నారు..(They ate people.) పసిపిల్లలను బలి ఇచ్చారు. నన్ను స్వేచ్ఛగా బతకనివ్వండి" అంటూ ఆమె రోడ్డుపై అరిచింది. తానూ ఒక ఉన్నత స్థాయి (Elite) పార్టీకి వెళ్లానని, అక్కడ ప్రముఖ వ్యక్తులు మనుషులను తినడం చూశానని ఆమె ఆరోపించింది. కార్లోస్ స్లిమ్ వంటి ప్రపంచ కుబేరుల పేర్లను కూడా ఆమె ఆ వీడియోలో ప్రస్తావించింది అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారగా.. ప్రస్తుతం మరోసారి తెరమీదకు వచ్చింది.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో ముడిపెడుతున్న నెటిజన్లు

ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్ దర్యాప్తు పత్రాల్లో 'లిటిల్ సెయింట్ జేమ్స్' ('Little Saint James') దీవిలో, కొన్ని ప్రైవేట్ యాచ్‌లలో జరిగిన పార్టీల గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ పత్రాల్లో పేర్కొన్న కొన్ని వికృత చేష్టలు, గాబ్రియేలా ఆ రోజు చేసిన ఆరోపణలకు దగ్గరగా ఉన్నాయని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి.. ఇలాంటి వ్యవస్థ నిజంగానే ఉందని పాత ఫోటోలు, వీడియోలను #Epstein Files తో టాగ్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి అనుగునంగానే కొన్ని వీడియోలు లభించడంతో నెటిజన్ల ఆరోపణలకు బలం చేకూరుతుంది.

ఆరోపణల తర్వాత గాబ్రియేలా మిస్సింగ్.. నేటికి మిస్టరీ..?

ఇదిలా ఉంటే ఆ రోజు మెక్సికోలోని హోటల్ బయట గాబ్రియేలా చేసిన వ్యాఖ్యల అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మానసిక చికిత్సా కేంద్రానికి తరలించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి పారిపోయిందని వార్తలు ఉన్నాయి. కానీ ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు. ఆమె మళ్ళీ ఎక్కడా కనిపించకపోవడంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల రహస్యాలను బయటపెట్టినందుకే ఆమెను మాయం చేశారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. నాటి నుంచి నేటి వరకు మోడల్ ఆచూకీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

గబ్రియేలా చేసిన ఆరోపణలు అప్పట్లో ఒక పిచ్చి దాని మాటలుగా కొట్టిపారేసినప్పటికీ, ఎప్‌స్టీన్ ఫైల్స్ బయటపడ్డాక ఆ మిస్టరీ మళ్ళీ మొదలైంది. ఆమె చెప్పిన 'ఎలైట్ పార్టీలు' ఇలాంటివేనా? ప్రపంచం చూడని చీకటి కోణం ఇదేనా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర చర్చకు దారి తీశారు. పలు దేశాల్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా భారత్ ఈ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది.

Next Story