ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై మార్చిలో సమావేశం కానున్న సీబీటీ!

by Web Desk |
ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై మార్చిలో సమావేశం కానున్న సీబీటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ)కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ(సీబీటీ) మార్చిలో సమావేశం కానుంది. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) డిపాజిట్ మొత్తంపై చెల్లించే వడ్డీ రేటు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమావేశం వచ్చే నెలలో జరగనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. ఈ సమావేశంలో వడ్డీ రేటు తో పాటు ఇతర పెట్టుబడి అంశాల గురించి చర్చించనున్నారు. గతంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు. ఈసారి కూడా అదే వడ్డీ రేటు వర్తించే అంశంపై స్పందించిన ఆయన ఆదాయ అంచనాలను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ 8.5 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. అనంతరం 2020-21 వడ్డీ మొత్తాలను ఇప్పటికే చందాదారుల ఖాతాలకు జమ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా సీబీటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుంది. దాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించాకే ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


Next Story

Most Viewed