- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రేండింగ్‌గా మారిని "ఎనర్జీ లాక్ డౌన్"
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇంధన సంక్షోభం తలెత్తింది. దీనితో ఇంధన ఆదా కోసం 'ఎనర్జీ లాక్‌డౌన్' విధిస్తారనే చర్చ ట్రెండ్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా vs ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమ ఆసియా (Western Asia)లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా (Fuel supply) వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక రవాణా మార్గాలకు అంతరాయం కలుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 'ఎనర్జీ లాక్‌డౌన్' అనే పదం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఎనర్జీ లాక్‌డౌన్ అంటే
ఆయా దేశాల్లోని ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ విద్యుత్ కొరత ఏర్పడినప్పుడు, వాటి వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విధించే ఆంక్షలే ఎనర్జీ లాక్ డౌన్ (Energy lockdown). ఇందులో భాగంగానే వాహనాల వినియోగం తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించడంపై పరిమితులు వంటి చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశం తన చమురు అవసరాల కోసం 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సరఫరా తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడే అవకాశం ఉంది.
దీనికి తోడు పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న నెటిజన్లు, మళ్ళీ దేశంలో సాధారణ లాక్‌డౌన్ విధిస్తారేమోనని 'ఇండియా లాక్‌డౌన్' ('India lockdown') అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఎనర్జీ ఆదా దిశగా సూచనలు చేస్తున్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి లాక్‌డౌన్ ప్రకటించలేదు. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ప్రజలు పానిక్ బయింగ్ చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కొతర ఏర్పడుతుంది. ఎక్కడ చూసిన పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్టులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎనర్జీ లాక్ డౌన్ పై మరిన్ని ఉహాగానాలను పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






