- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. టెర్రిస్టులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు భారత సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. నిఘా వర్గాల పక్కా సమాచారంతో మాండ్రాల్-సింఘురా సమీపంలోని సోనార్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా అక్కడే తలదాచుకున్న టెర్రరిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పెద్దఎత్తున మోహరించి జైష్-ఏ-మొహమ్మద్ (జెఎం) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల వద్ద ఏకే-47 రైఫిల్స్, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, టెర్రరిస్టులు తప్పించుకోకుండా సోనార్ అటవీ ప్రాంతాన్ని అదనపు బలగాలు చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు. సమీప గ్రామాలకు హెచ్చరిక జారీ చేశారు. ఇండో-పాక్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్లు చక్కర్లుకొట్టిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.






