నెట్‌ఫ్లిక్స్‌పై సెటైర్ వేసిన ఎలన్ మస్క్.. వార్ ఎండ్ కాగానే..

by Disha Web Desk 19 |
నెట్‌ఫ్లిక్స్‌పై సెటైర్ వేసిన ఎలన్ మస్క్.. వార్ ఎండ్ కాగానే..
X

దిశ, సినిమా: టెస్లా అధినేత ఎలన్ మస్క్.. రష్యా - ఉక్రెయిన్ వార్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెటిఫ్లిక్స్‌పై సెటైర్ వేశాడు. 'ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్.. వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందా అని చూస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్‌కు చెందిన నల్లజాతీయుడు, ట్రాన్స్‌జెండర్ అయిన రష్యన్ సైనికుడు ప్రేమలో పడ్డారనే నేపథ్యంలో మూవీని తెరకెక్కించేందుకు వెయిట్ చేస్తోంది' అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఎలన్ మస్క్‌ను తిట్టిపోస్తున్నారు. యుద్ధంలో ప్రాణాలు పోతున్నాయనే బాధ లేకుండా ఇలాంటి మీమ్స్, సెటైర్స్ షేర్ చేసేందుకు బుద్ధి లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా తాజాగా ఎలన్ మస్క్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులిచ్చేసిన ఎలన్ మస్క్.. ప్రస్తుతం 2021లో బ్రేకప్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ గ్రైమ్స్‌తోనే సీక్రెట్‌గా మరో బిడ్డకు జన్మనిచ్చాడు.



Next Story