- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికొద్ది సేపట్లో మున్సిపల్ చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, నేడు చైర్మన్, ఉప చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠగా సాగనుంది. అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిదో నేడు తేలనున్నది. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలో సోమవారం చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఆయా మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఆ పార్టీకే చైర్మన్, వైఎస్ చైర్మన్ దక్కడం లాంచనమే. కాగా ఇప్పటికే మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మధిర మున్సిపాలిటీ మినహా వైరా సత్తుపల్లి, కల్లూరు ఏదులాపురం మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కాగా ఇక్కడ చైర్మన్‌గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడికి అవకాశం ఇస్తారని సమాచారం. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఓ మహిళకు ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళకు కేటాయించగా, నాలుగుసార్లు కౌన్సిలర్ గా పోటీ చేసిన ఓ మహిళకు ఇస్తారని సమాచారం. ఇక వైరా, మధిర జనరల్ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ సైతం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి కొండా సురేఖ...మున్సిపాలిటీలకు చైర్మన్ పేరు ప్రకటించనుండగా, చైర్మన్ ఎవరో అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.
దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో సోమవారం చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఆయా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాగా ఇప్పటికే మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మధిర మున్సిపాలిటీ మినహా వైరా సత్తుపల్లి, కల్లూరు ఏదులాపురం మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు ఏదులాపురం మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులను సమీపంలో ఒక రిసార్ట్ కు తరలించగా వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తరలించారు. సోమవారం మధ్యాహ్నంలోగా చైర్మన్, ఉప చైర్మన్‌ల ఎంపిక జరగనున్నది.
కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా ఇక్కడ చైర్మన్‌గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడికి అవకాశం ఇస్తారని సమాచారం. పొంగులేటి వైసీపీలో ఉన్నప్పటి నుంచి సదరు వ్యక్తి మంత్రి అనుచరుడిగానే కొనసాగుతున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఈ మున్సిపాలిటీలో నలుగురు ఎస్సీ మహిళలు విజయం సాధించారు. కాగా గెలిచిన ఒక మహిళా అభ్యర్థి పేరును ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ చైర్మన్ పదవి కోసం ముగ్గురు మహిళలు పోటీపడుతుండగా నాలుగు సార్లు కౌన్సిలర్‌గా చేసిన ఒక మహిళకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.
వైరా మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రకారం జనరల్ మహిళకు కేటాయించారు అయితే ఇక్కడ కూడా చైర్మన్ పదవికి మహిళా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక మధిర మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అయితే చైర్మన్ పేరు సీల్డ్ కవర్ లో వస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చైర్మన్ పేరు ప్రకటిస్తారని ఆయన తెలపడంతో చైర్మన్ ఎవరో అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.






