బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్‌లో ED Raids..

by Disha Web Desk 19 |
ED Raids on two Casino Organizers houses in Hyderabad and Andhra Pradesh
X

దిశ, వెబ్‌డెస్క్: ED Raids on two Casino Organizers houses in Hyderabad and Andhra Pradesh| క్యాసినో వ్యవహారంపై హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో ఆడించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ రైడ్స్ చేస్తోంది. గుడివాడతో పాటు హైదరాబాద్‌లో క్యాసినో ఆడిస్తూ ప్రవీణ్ పట్టుబడ్డాడు. కాగా, హైదరాబాద్‌లో మొత్తం 8చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. నిందితులపై ఫెమా చట్టం కింది ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో కూడా ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే, మాధవరెడ్డి జూన్ 10నుంచి 4 రోజుల పాటు నేపాల్‌లో క్యాసినో నిర్వహించినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానాల్లో పేకాట రాయుళ్లను తరలించి.. ఇండో - నేపాల్ సరిహద్దులోని సిలిగురిలో క్యాసినో శిబిరాలు ఏర్పాటు చేశారని.. ఈ క్యాసినోలలో ఆడి, పాడేందుకు టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్ల తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని అధికారులకు షోకాజ్ నోటీసులు!

Next Story