జమ్ము కశ్మీర్లో భూకంపం

by Muthe.Rajitha |

సోమవారం ఉదయం జమ్ము కశ్మీర్‌లో భూకంపం సంభవించింది.

జమ్ము కశ్మీర్లో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం ఉదయం జమ్ము కశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఫిబ్రవరి 2 ఉదయం సుమారు 5:35 గంటలకు శ్రీనగర్‌కు దక్షిణ–పశ్చిమంగా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, బద్గాం జిల్లా సోయిబుగ్‌ సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టు సమాచారం. ఉంది. శ్రీనగర్‌, చారార్‌-ఇ-శరీఫ్‌, పుల్వామా, షోపియాన్‌, బారాముల్లా తదితర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్ళీ ప్రకంపనలు వస్తాయేమో అనే భయంతో ప్రజలు రోడ్ల మీదనే ఉండిపోయారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపాలకు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో కశ్మీర్ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story