శనివారం నుంచి ఎప్ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు.. విద్యార్థుల కోసం కటాఫ్ వివరాలు విడుదల!

by Malleboina Mahesh |

తెలంగాణలో టీజీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల కోసం కాలేజీల వారీ కటాఫ్ ర్యాంకుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.

శనివారం నుంచి ఎప్ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు.. విద్యార్థుల కోసం కటాఫ్ వివరాలు విడుదల!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా టీజీఈఏపీ సెట్-2026 ప్రవేశ పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం తాము ఆశించే కాలేజీలు, బ్రాంచ్‌ల ఎంపికపై అవగాహన కోసం గతేడాదికి సంబంధించిన మూడు విడతల కటాఫ్ ర్యాంకుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు https://tgeapcet.nic.in సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కటాఫ్ ర్యాంకుల స్టేట్‌మెంట్లను కాలేజీల వారీగా, బ్రాంచ్ వారీగా, జెండర్ వైస్, కేటగిరీల వారీగా పొందుపరిచారు. ప్రవేశ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు, ఆ తర్వాత కౌన్సిలింగ్ సమయంలో ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ముందుగానే ఒక అంచనాకు రావడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని సాంకేతిక విద్య కమిషనర్, టీజీసెట్-2026 కన్వీనర్ ఎ. శ్రీదేవసేన తెలిపారు.

Next Story