Dulquer Salmaan: రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీపై దుల్కర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-25 11:28:13  IST  )

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.

Dulquer Salmaan: రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీపై దుల్కర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. మలయాళంతో పాటు అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రజెంట్ దుల్కర్(Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మూవీ అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో దుల్కర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా, దుల్కర్(Dulquer Salmaan) ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘రంగస్థలం’(Rangasthalam) మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రీసెంట్‌గా మీరు చూసిన సినిమాల్లో ఏది బాగుందని యాంకర్ అడగ్గా.. దానికి దుల్కర్ స్పందిస్తూ.. ‘‘రీసెంట్‌గా కాదు కానీ రంగస్థలం సినిమాని ఇటీవల మళ్లీ చూశాను. అది ఒక సూపర్ హిట్ మూవీ. చరణ్(Ram Charan) అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాలో మంచి ట్విస్టులు ఉన్నాయి అవి ఊహించలేదు కూడా. అది మన రూటెడ్ చిత్రం. ఇటీవల మన కథలు, విలువలు ఉన్న సినిమా. అయితే ఇటీవల వచ్చినవన్నీ పాన్ ఇండియా మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అవ్వలేదు అని అనుకుంటున్నాను.

ఆ సినిమాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు వచ్చి ఉంటే పాన్ ఇండియా సక్సెస్ అయ్యేది’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ దుల్కర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ‘రంగస్థలం’ (Rangasthalam)మూవీలో రామ్ చరణ్(Ram Charan), సమంత జంటగా నటించి మెప్పించారు. అయితే దీనిని సుకుమార్ తెరకెక్కించగా.. తెలుగులోనూ విడుదలై భారీ హిట్ కొట్టింది.

Next Story