పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. పట్టుబడ్డ ఐదుగురు కాలేజీ విద్యార్థులు

by Malleboina Mahesh |

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం గా మారింది. నగరంలోని పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి.

పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. పట్టుబడ్డ ఐదుగురు కాలేజీ విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం గా మారింది. నగరంలోని పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. నాగార్జున సర్కిల్ సమీపంలో డ్రగ్స్ తీసుకుంటున్న ఐదుగురు విద్యార్థులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ సేకరించారు, ఇందులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. కాలేజీ విద్యార్థులు ఇలా డ్రగ్స్‌తో పట్టుబడటం సంచలనంగా మారగా.. నగర ప్రజలు ఈ వ్వహారం గురించి తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు.

Next Story