మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి నష్టం: జైలర్ స్రవంతి

by Jakkula.Mamatha |

మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తులతో పాటు అతని కుటుంబం తద్వారా సమాజానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని నర్సంపేట జైలర్ స్రవంతి అన్నారు.

మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి నష్టం: జైలర్ స్రవంతి
X

దిశ, నర్సంపేట: మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తులతో పాటు అతని కుటుంబం తద్వారా సమాజానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని నర్సంపేట జైలర్ స్రవంతి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా నర్సంపేట సబ్ జైలులో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జైలర్ స్రవంతి మాట్లాడుతూ.. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యసనాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని అన్నారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని జైలు ఖైదీలతో ప్రతిజ్ఞ చేయించారు. ఇతరులను చైతన్య పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story