- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము.. ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్‌కు ఘన స్వాగతం
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సారి పరేడ్ ‘వందేమాతరం - 150 ఏళ్లు’ అనే థీమ్‌తో సాగుతోంది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన ప్రత్యేక గీతం ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది. ముందుగా రాష్ట్రపతి భవన్ నుంచి ప్రెసిడెంట్ ముర్ముతో కలిసి ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ కిలిసి సాంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఎదురెల్లి వారికి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంటన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పథ్ వేదికగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించగా.. అనంతరం జాతీయ గీతాలాపేన చేశారు.
ఇక తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో భారత సైన్యం ‘ఫేజ్డ్ బ్యాటిల్ అర్రే’ (Phased Battle Array) ప్రదర్శనను చేపట్టింది. ఇందులో డ్రోన్లు, ట్యాంకులు, ఆర్టిలరీని నిజమైన యుద్ధరంగంలో ఉండే ఫార్మేషన్లలో ప్రదర్శించారు. ఈ పరేడ్‌లో ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించిన ఆయుధ వ్యవస్థల నమూనాలను ప్రదర్శించి, దేశ భద్రతా సన్నద్ధతను చాటిచెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా 30 శకటాలు ప్రదర్శించబోతున్నారు. అయితే, రొటేషన్ పద్ధతి కారణంగా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శకటాలకు కర్తవ్య పథ్ పరేడ్‌లో అవకాశం దక్కలేదు.






