- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యాహ్న భోజనంలో రాజీ పడొద్దు.. విద్యా శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సచివాలయంలో విద్యాశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సచివాలయంలో విద్యాశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం (Breakfast), మధ్యాహ్న భోజనం (Lunch) నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భోజనం తయారీలో పారదర్శకత, పరిశుభ్రత ఉండేలా ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ (Centralized Kitchen) ఏర్పాటు చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల ఆహారాన్ని ఒకే చోట వండి అన్ని పాఠశాలలకు పంపిణీ చేయడం ద్వారా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఒకే చోట అందించడమే ఈ పాఠశాలల లక్ష్యమని అన్నారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పర్యావరణ హితంగా ‘సోలార్ కిచెన్లు’
ఆహార తయారీ ప్రక్రియలో అత్యాధునిక సాంకేతికతను జోడించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పత్యేకంగా సూచనలను చేశారు. కాలుష్యం లేకుండా ఇంధన పొదుపు కోసం సోలార్ కిచెన్లు (Solar Kitchens) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పర్యావరణ హితంగా ఉండే ఈ విధానం ద్వారా వంట పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.






