Sperm: నిద్రలో వీర్యం బయటకు పోతుందా.. కారణం వెల్లడించిన నిపుణులు?

by Kodari Anjali |

తెల్లని బూడిదరంగులో ఉండే ద్రవమే వీర్యం (Semen).

Sperm: నిద్రలో వీర్యం బయటకు పోతుందా.. కారణం వెల్లడించిన నిపుణులు?
X

దిశ, వెబ్‌డెస్క్: తెల్లని బూడిదరంగులో ఉండే ద్రవమే వీర్యం (Semen). ఇది జిగటగా ఉంటుంది. వీర్యంలో స్పెర్మ్ కణాలు, ఫ్రక్టోజ్(Fructose), విజయవంతమైన ఫలదీకరణాన్ని సులభతరం చేయడానికి స్పెర్మ్ మనుగడకు మేలు చేసే ఎంజైమ్‌లు ఇందులో ఉంటాయి. వీర్యంలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. పురుషులు స్ఖలనం టైంలో రిలీజ్ చేసే ఈ తెల్లటి మందపాటి ద్రవంలో స్మెర్మ్ కణాలు ఉంటాయి. తద్వారా ఆడ గుడ్లను ఫలదీకరణం చేసి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి.

వీర్యం స్త్రీ యోనిలో ఐదు రోజుల వరకు జీవించి ఉంటుందని నిపుణులు వెల్లడిస్తుంటారు. ఇది స్ఖలనం కాకపోతే.. పురుషుడి బాడీలో దాదాపు డెబ్బై రోజుల పాటు ఉంటుంది. తర్వాత స్మెర్మ్ కణాలు (Smear cells) చనిపోయి.. శరీరం ద్వారా తిరిగి గ్రహిస్తాయి. అయితే నిద్రలో ఈ స్మెర్మ్ బయటకు పోతే మనుషులు వీక్ అవుతారా? అనే దానిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. నిద్రిస్తున్నప్పుడు వీర్యం అనేది లీక్ అయితే.. బలహీనపడుతారని అనుకోవడం కేవలం అది అపోహా మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

అలా జరిగినప్పుడు శరీరంలోని పాత స్మెర్మ్‌ తొలగిపోతుందని అంటున్నారు. తర్వాత కొత్త హెల్తీ స్మెర్మ్ ఏర్పడటానికి దోహదపడే సహజ ప్రక్రియ అని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే నిద్రిస్తున్నప్పుడు హార్మోన్ల లెవల్స్‌లో ఛేంజెస్ జరగడం వల్ల.. అంతేకాకుండా లైంగిక ఆలోచనలు రావడం వల్ల బాడీ ఉత్తేజితమై.. స్మెర్మ్ బయటకు పోతుందని పేర్కొంటున్నారు. దీనినే స్వప్న స్కలనం(Swapna skalanaṁ) అని అంటారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story