- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: నాగచైతన్యకు ఆ పాడు అలవాటు ఉందా..? నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి.. ‘ఏమాయ చేసావే’ చిత్రంతో ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రజెంట్ ఆయన ‘తండేల్’(Tandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇక చైతు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)ను ప్రేమించారు.
అయితే వీరిద్దరు పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలువలేదు. మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి చైతు తన ఫోకస్‌ను సినిమాలపై పెట్టాడు. అలాగే శోభిత(Shobhita Dhulipala)తో సీక్రెట్‌గా డేటింగ్ కూడా చేశారు. ఇటీవల పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం(engagement) కూడా చేసుకుని అందరికీ బిగ్ షాకిచ్చారు. త్వరలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నెట్టింట ఓ వార్త వైరల్ అవుతూ దుమారం రేపుతోంది.
పైకి సైలెంట్‌గా కనేపడే చైకి ఓ పాడు అలవాటు ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే ఆయన దగ్గరి స్నేహితులు, అమల దూరం పెడుతూ ఉంటారట. తన మనసు బాగా హర్ట్ అయినప్పుడు మందు తాగేస్తాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఎవ్వరు లేని ప్రదేశంలో కూర్చుని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధను ఆ విధంగా ఎక్స్ ప్రెస్ చేస్తూ ఉంటాడని టాక్. కొన్ని కొన్ని సార్లు తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడేస్తాడట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.