- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్లు తొలగిస్తారనే అపోహలు నమ్మొద్దు
ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ చేపడుతున్నామని, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

దిశ, మెదక్ టౌన్ : ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ చేపడుతున్నామని, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ఈ నెల 25 నుంచి కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మెదక్ పట్టణంలోని గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ నంబర్-135లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలో ప్రతి ఇంటి యజమానికి స్పష్టంగా వివరించాలని, నింపిన ఫారాలను రెండు నుంచి మూడు రోజుల్లో బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని సూచించారు. గ్రామాల్లో రెండు రోజుల్లో ఫారాల పంపిణీ పూర్తిచేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఫారాల పంపిణీ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా అన్ని వివరాలను సక్రమంగా నమోదు చేసి ఫారాలను తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






