తమిళనాడులో రణరంగం.. వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే దాడి

by Malleboina Mahesh |

మయిలాడుదురైలో డీఎంకే, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే శ్రేణులు, కాంగ్రెస్ జెండాలను లాక్కొని నిరసన తెలిపాయి.

తమిళనాడులో రణరంగం.. వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే దాడి
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ సీఎంగా ప్రమాణం చేయడానికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Governor Rajendra Arlekar) అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు మయిలాడుదురైలో ఆందోళన చేపట్టారు. అయితే, ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న డీఎంకే శ్రేణులు (DMK ranks) కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసి, ఫలితాలు రాగానే టీవీకేకు మద్దతు తెలపడం 'వెన్నుపోటు' అని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. నిరసన ప్రదర్శనలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పార్టీ జెండాలను డీఎంకే శ్రేణులు బలవంతంగా లాక్కొని రోడ్డుపై పడేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాజకీయ ప్రకంపనలు

డీఎంకే ప్రతినిధులు కాంగ్రెస్ వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. "కాంగ్రెస్‌ను రాష్ట్రం నుండి తరిమికొట్టాలి" అంటూ డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేయడం ఇరు పార్టీల మధ్య ఉన్న గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం వల్ల ఇండియా కూటమి (INDIA Bloc) లో కూడా చీలికలు వచ్చాయి. ఈ మేరకు డీఎంకే.. కూటమి నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు డీఎంకే విమర్శలను కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తిప్పికొట్టారు. ప్రజాతీర్పు డీఎంకేకు వ్యతిరేకంగా వచ్చిందని, తాము బీజేపీని అడ్డుకోవడానికే టీవీకేకు మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Next Story