Divorce: తల్లిదండ్రులు విడాకులు.. ఇది పిల్లల హెల్త్‌పై ఏ విధంగా ప్రభావం చూపుతుంది?

by Kodari Anjali |   (  Updated:2025-01-27 14:26:58  IST  )

ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్తున్నారు.

Divorce: తల్లిదండ్రులు విడాకులు.. ఇది పిల్లల హెల్త్‌పై ఏ విధంగా ప్రభావం చూపుతుంది?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో డివోర్స్ (Divorce) అనేది కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొంతమంది భార్యాభర్తలు క్షణికావేశంలో గొడవలు పడుతారు కానీ.. తర్వాత పిల్లల కోసం ఆలోచించి.. వెనకడుగు వేసి సర్దుకుపోతారు. కానీ మరికొంతమంది దంపతులు మాత్రం సర్దుకుపోవాల్సింది పోయి.. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే తల్లిదండ్రులు అలా చేయడం వల్ల పిల్లలు చాలా సఫర్ అవుతారన్న విషయం తెలిసిందే. మరీ ఈ సమస్యలు పిల్లల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజా అధ్యయనం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

కామన్‌గా పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఎక్కువగా ఉంటారు. కాగా పేరెంట్స్ సరిగ్గా ఉంటేనే పిల్లలు ఏదైనా వారి వద్ద నేర్చుకోగలుగుతారు. కానీ తల్లిదండ్రులే తరచూ గొడవ పడుతుంటే పిల్లల మైండ్ పై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో వారు చదువుపై పూర్తి శ్రద్ధ (attention) పెట్టలేదు. తరగతి గదిలో కూడా పేరెంట్స్ గొడవ గురించే ఆలోచిస్తారు. అయితే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల పిల్లలకు స్ట్రోక్ (stroke) వచ్చే అవకాశం ఉందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ అధ్యయనంలో 65 అంతకంటే ఎక్కువ ఏజ్ గల పదమూడు వేల మందిని సర్వే చేయడం వల్ల ఈ విషయం బయటకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యామిలీతో ఉన్న వారి కంటే డివోర్స్ తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకే ఎక్కువ స్ట్రోక్ వచ్చిందని అంటున్నారు. అంతేకాకుండా అలాంటి వారిలో డయాబెటిస్(Diabetes), డిప్రెషన్ (Depression)వంటి ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు బ్లడ్ సర్కులేషన్ (Blood circulation) సరిగ్గా జరగకపోవడం, మెదడులోని భాగాలు దెబ్బతినడం(23), మెదడులోని భాగాలకు బ్లడ్ సరఫరా ఆగిపోవడం, రక్తనాళం చిట్లడం (Blood vessel rupture) వల్ల స్ట్రోక్ వస్తుందని చెబుతున్నారు. అలాగే చిన్న ఏజ్‌లోనే మానసికం(mental)గా కూడా బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి!

Next Story