ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ లేఖ!

by Malleboina Mahesh |

ఆప్‌లో భారీ సంక్షోభం! బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు సంజయ్ సింగ్ లేఖ. ఇది చట్టవిరుద్ధమైన చీలిక అని ఆప్ ఆగ్రహం.

ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ లేఖ!
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో చారిత్రక చీలిక సంభవించి ఆ పార్టీని వీడి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం వారు ఆప్ పార్టీపై కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాగా ఈ రోజు సాయంత్రం బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. పార్టీని వీడిన ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. సంజయ్ సింగ్ తన వాదనలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.అలాగే ఫిరాయింపు నిరోధక చట్టం (10వ షెడ్యూల్) ప్రకారం సభలో ఎలాంటి 'చీలిక'కు లేదా విడిగా గ్రూపుగా ఏర్పడటానికి చట్టబద్ధత లేదని, 2/3వ వంతు మెజారిటీ ఉన్నప్పటికీ వారు అనర్హతకు గురవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, బీజేపీలో చేరిన ఎంపీలు తమ చర్యను చట్టబద్ధమైన 'విలీనం' (Merger) గా పేర్కొంటూ, తమపై అనర్హత వేటు పడదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది పంజాబ్ ప్రజల తీర్పును వంచించడమేనని, 'ఆపరేషన్ లోటస్' లో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని సంజయ్ సింగ్ మండిపడ్డారు. మాతృ పార్టీని వీడటం అంటే స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడమేనని ఆయన వాదిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో, గతంలో జరిగిన విలీనాల ఉదంతాలను ఇరు పక్షాలు ఉటంకిస్తున్నాయి. ఈ నిర్ణయం భవిష్యత్ రాజకీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Next Story