ముఖంపై విశాలమైన చిరునవ్వు తప్ప మరేమీ లేదు.. హాట్ బ్యూటీ

by Disha Web Desk 16 |
ముఖంపై విశాలమైన చిరునవ్వు తప్ప మరేమీ లేదు.. హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: హాట్‌ బ్యూటీ దిశా పటానీ, జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియా నటించిన తాజా చిత్రం 'ఏక్ విలన్ రిటర్న్స్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో తన నటనపై వెల్లువెత్తుతున్న ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేసింది దిశ. మూవీ రిలీజ్‌కు ముందు మొదటి షో టాక్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌పై ఉత్కంఠ నెలకొందని చెప్పింది. అయితే ప్రేక్షకుల స్పందన తాను ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉందని.. ఇంతటి ప్రేమను కురిపించినందుకు ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక కరోనా తర్వాత మళ్లీ థియేటర్‌లలో సినిమాల సందడి చూసి గొప్పగా ఫీలయ్యానన్న నటి.. సోషల్ మీడియాలో యాక్టింగ్‌ను ఎంకరేజ్ చేస్తూ రాసిన కామెంట్లు చదువుతున్నప్పుడు ముఖంపై విశాలమైన చిరునవ్వు తప్ప మరేమీ లేదని హ్యాపీగా ఫీలైంది. చివరగా ఇలాంటి ప్రశంసలు, ప్రేమ అపారమైన సంతృప్తిని కలిగిస్తుందని.. అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది.


Next Story