'సుడా' డైరెక్టర్‌కు అందని ఆహ్వానం.. కావాలనేనా..? లేక రాజకీయమా..?

by Disha Web Desk 13 |
సుడా డైరెక్టర్‌కు అందని ఆహ్వానం.. కావాలనేనా..? లేక రాజకీయమా..?
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్​ మండల పరిధిలోని 14 పంచాయతీలు సుడా పరిధిలో ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం సుడాను ఏర్పాటు చేసే ముందు ఒక కమిటీని నియమించడంతో పాటు పాలకమండలిని కూడా నియమించింది. సుడా పరిధిలో జరిగే సమావేశాలు, అభివృద్ధి పనుల్లో డైరెక్టర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. దానిలో భాగంగానే రూరల్​మండలం నుంచి సుడా సలహమండలి డైరెక్టర్‌గా గూడ సంజీవరెడ్డిని నియమించారు. కానీ బుధవారం రూరల్​మండల పరిషత్​హల్‌లో నిర్వహించిన సుడా మాస్టర్​ ప్లాన్​రూపకల్పన సమావేశానికి డైరెక్టర్​సంజీవరెడ్డికి అధికారుల నుంచి ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదు. కావాలనే అధికారులు ఇవ్వ లేదా..? లేక రాజకీయంగా ఏమైనా జరిగిందా అనేది ప్రశ్నగా మిగిలింది.

సుడా డైరెక్టర్​ లేకుండా అది రూరల్ మండల పరిధిలో సమావేశం ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్న. ఈ సమావేశంలో ఎంపీడీవో, ఎంపీవో, సుడా అధికారులు, ఐబీ, ఆర్​అండ్​బీ, పంచాయతీ కార్యదర్శులు కూడా పాల్గొనడం మరొక విశేషం. కనీసం విలేకరులకు కూడా సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. విలేకరులకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీవో ఆశోక్‌ను వివరణ అడగ్గా ఇప్పటి నుంచి మరోసారి ఇలా జరగకుండా చూస్తానని పేర్కొన్నారు.

నాకు ఆహ్వానం అందలేదు: గూడ సంజీవరెడ్డి, సుడా డైరెక్టర్..

రూరల్​మండల పరిషత్​కార్యాలయంలో నిర్వహించే సుడా సమావేశానికి నాకు అధికారుల నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదు. సమావేశం ఉందని నాకు బుధవారమే తెలిసింది. డైరెక్టర్​ నేను ఉండగా కనీసం సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఎమ్మెల్యే కందాలకు ఫిర్యాదు చేస్తాను. అధికారులు డైరెక్టర్లపై చిన్నచూపు చూడటం మానుకోవాలి. విషయాన్ని కలెక్టర్, సుడా చైర్మన్, వైస్​చైర్మన్​దృష్టికి కూడా తీసుకెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి విన్నవిస్తా.



Next Story

Most Viewed