- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘CAT’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు
వీఆర్‌జీఆర్ మూవీస్ బ్యానర్ పై Y. గంగాధర్ IPS సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘క్యాట్’(CAT).

దిశ, సినిమా: వీఆర్‌జీఆర్ మూవీస్ బ్యానర్ పై Y. గంగాధర్ IPS సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘క్యాట్’(CAT). థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో G.V. నాయుడు(GV Naidu) , V.J. బాలు , లావణ్య , కళ్యాణి రాణి (Kalyani Rani)ప్రధాన పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడే ‘క్యాట్’ మూవీ పోస్టర్ లాంచ్ చేశాము. దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, ‘క్యాట్’ స్టోరీ కూడా చెప్పారు. వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ‘క్యాట్’ చిత్ర విజయం పొందాలని బుచ్చి బాబు ఆకాంక్షించారు.






