లైంగికదాడికి ఆమె సహకరించింది.. భావన కేసులో మరో ట్విస్ట్

by Dishanational2 |
లైంగికదాడికి ఆమె సహకరించింది.. భావన కేసులో మరో ట్విస్ట్
X

దిశ, సినిమా : మళయాల నటి భావన మీనన్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. భావనపై దాడి కుట్రలో హీరో దిలీప్ భార్య కావ్య మాధవన్ ప్రమేయం కూడా ఉందనేందుకు ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న ఆమెను విచారించనున్నట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. ఇక ఈ కేసు నిందితుల్లో ఒకరైన సూరజ్(దిలీప్ బావ) ఫోన్ నుంచే కావ్య మాధవన్ సంబంధిత క్రైమ్ ప్లాన్ చేసినట్లు వాయిస్ నోట్ సూచిస్తోందని.. సూరజ్, శరత్, కావ్య మధ్య జరిగిన సంభాషణే అందుకు సాక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు. నిజానికి కావ్య మాధవన్‌, బాధితురాలు భావన మంచి స్నేహితులు. ఇదే అస్త్రంగా భావనను నమ్మించి, తాము చెప్పిన చోటుకు ఆమెను రప్పించాలని కావ్యను సూరజ్ కోరినట్లు క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుండగా.. నటి భావన మీనన్ ఐదేళ్ల విరామం తర్వాత ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed