- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏప్రిల్ 14న డిజిటల్ సాధికారత దినోత్సవం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏప్రిల్ 14న డిజిటల్ సాధికారత దినోత్సవం జరగనుందని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి నాణ్యమైన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను ఉన్నత విద్యా సంస్థలు అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కెరియర్ అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో పలు నైపుణ్య, ఉపాధి ఆధారిత కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి కి వ్యాపార పరివర్తన అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ ఇ-కామర్స్, మొబైల్ కామర్స్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార పద్ధతులను, వినియోగదారుల ఆలోచనా విధానాలను మారుస్తున్నాయన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దశలు ఇప్పుడు డిజిటలైజేషన్, కోవిడ్ మహమ్మారి తరువాత పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో కొత్త శకానికి దారితీసిందని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఉన్నత విద్యా సంస్థలు నాణ్యమైన, ఉపాధి ఆధారిత విద్యను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో నైపుణ్య ఆధారిత, ఉపాధి ఆధారిత కోర్సులు ప్రవేశపెట్టామని ఆయన వివరించారు.
యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఆర్థిక అవకాశాలకు పెంపొందించడానికి విద్యా బోధనలో సరికొత్త వ్యూహాలను పునరాలోచించుకోవాలని సూచించారు. తమ విధ్యార్ధులను కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులుగా చూడాలనే లక్ష్యంతో టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జయేష్ రంజన్, మాట్లాడుతూ తలసరి ఆదాయం పరంగా దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఉందని, గ్రామీణ ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి కార్బన్ ఉద్గార రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (కోజికోడ్) డీన్ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) ప్రొఫెసర్ సుదర్శన్ కుంట్లూరు, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ డీన్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్స్, డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






