- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలేరు మున్సిపాలిటీలో డీజిల్ దొంగలు
ఆలేరు మున్సిపాలిటీలో డీజిల్ అక్రమాలు. ప్రభుత్వ నిధులతో సొంత వాహనానికి డీజిల్ కొట్టిస్తూ ప్రజా సొమ్మును మింగుతున్న అధికారిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు.

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో ప్రజల నుంచి వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రజలకు మౌలిక మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ కోసం పారదర్శకంగా ఖర్చు చేయాల్సిన ఒక అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తు ప్రజా ధనాన్ని తన సొంత అవసరాలకు వాడుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి తన సొంత వాహనంలో స్థానికంగా వున్న ఒక పెట్రోల్ బంక్ యాజమాన్యం తో కుమ్మకై రెండు రోజులకు ఒకసారి తన సొంతానికి చెందిన ప్రైవేటు వాహనంలో డీజిల్ పోసుకొని ప్రజా అవసరాల నిమిత్తం మున్సిపాలిటీలో తిరిగే వాహనాల పేరు మీద తప్పుడు బిల్లులు రాయిస్తూ డీజిల్ దొంగతననానికి పాల్పడుతు ప్రజా సొమ్మును దిగమందుతున్నాడని ఆలేరు పట్టణం లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
డీజిల్ ప్రైవేట్ వాహనంలో, బిల్లు ప్రభుత్వాహనంపై ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయం లో పారిశుధ్య నివారణ, మంచినీటి సౌకర్యం కోసం మొత్తం 13 వాహనాలు ఉన్నాయి. వీటిలో 8 ఆటోలు, 3 ట్రాక్టర్లు, ఒక వైకుంఠ రథం, ఒక వాటర్ ట్యాంకర్ కలవు.వీటి నిర్వహణ కోసం స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్ బంక్ యాజమాన్యానికి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ప్రతి నెలా సుమారు రూ లక్ష నుంచి 1.50లక్షలు డీజిల్ కు బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు. ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయంలో సదరు అధికారి వారానికి రెండు సార్లు తన సొంత వాహనంలో 65 లీటర్ల చొప్పున నెలకు 260 లీటర్ల డీజిల్ పోసుకొని బిల్లులు మాత్రం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ట్రాక్టర్లకు, ఆటోలకు పోసినట్లుగా బంకు యజమానితో తప్పుడు బిల్లులు రాయిస్తున్నాడు.డీజిల్ కు లీటర్ రూ 95.59 రూపాయలు కాగా ఈ లెక్కన నెలకు డిజిల్ పేరున అక్షరాల రూ 24వేల853 రూపాయలు ప్రజల సొమ్మును డీజిల్ రూపంలో మింగేస్తున్నాడు.
ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయం నిధులు లేమి తో ఓవైపు కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు మాత్రం సంబంధిత అధికారే అక్రమాలకు పాల్పడడం వల్ల ఆలేరు మున్సిపాలిటీ మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టువేయబడుతుందని రాజకీయ మేధావులు అధికారుల తీరును విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు ప్రజా సొమ్ము దిగ మింగుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని ఆలేరు అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.ఈ విషయమై ఆలేరు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోసం ఫోన్ చేయగా అతని ఫోన్ అందుబాటులోకి రాలేదు.






