- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరా మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం
వైరా మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం జరిగిందా....? గత ఏడేళ్లగా ఈ తంతు కొనసాగుతుందా..? కొత్త పాలకవర్గం వచ్చాక డీజిల్ వినియోగం తగ్గిందా.. అనే ప్రశ్నలకు నూతన పాలకవర్గం సాక్షిగా సమాధానం వచ్చింది.

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం జరిగిందా....? గత ఏడేళ్లగా ఈ తంతు కొనసాగుతుందా..? కొత్త పాలకవర్గం వచ్చాక డీజిల్ వినియోగం తగ్గిందా.. అనే ప్రశ్నలకు నూతన పాలకవర్గం సాక్షిగా సమాధానం వచ్చింది. గత ఏడేళ్లుగా ప్రతి నెల రూ. 5 లక్షలు డీజిల్ పేరుతో అప్పటికి పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్ నిధులు మంజూరు చేశారు. అయితే నూతన పాలకవర్గం వచ్చిన తర్వాత డీజిల్ లెక్కలు భారీగా తగ్గాయి. ఒక శాతం.. రెండు శాతం కాదండోయ్ బాబోయ్.. ఏకంగా 45 శాతం డీజిల్ ఖర్చులు తగ్గాయి. ఇంకో విషయం ఏమిటంటే యుద్దాల వల్ల డీజిల్ రేటు పెరిగినా కూడా వైరా మున్సిపాలిటీలో డీజిల్ వాడకం తగ్గటం విశేషం.. ఈ పరిస్థితిని అర్థం చేసుకునే సగటు మానవుడి కూడా ఈ అవినీతి అర్థమవుతుంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపా చంద్రకళ భర్త కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేకంగా డీజిల్ వినియోగం పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తమ పాలకవర్గం రాకముందు ప్రతి నెల రూ. 5 లక్షలు డీజిల్ పేరుతో వినియోగించారని పేర్కొన్నారు. తమ పాలకవర్గం వచ్చిన తర్వాత ప్రతి నెల రూ. 3 లక్షలు మాత్రమే డీజిల్ కు వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరిగినప్పటికీ నెలకు రూ. 3 లక్షలు వినియోగిస్తున్నారు. గతంలో రిపేర్ లో ఉన్న చెత్త టాక్టర్లు, ఆటోలను సైతం రిపేరు చేయించారు. ఇదంతా చూస్తే గతంలో వైరా మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2023 నుంచి 2026 వరకు చింతా వేణు, యూ.గురులింగం కమిషనర్లుగా పనిచేశారు. ఈ అవినీతిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రముఖ భూమిక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇప్పటికైనా సీడీఎంఏ రాష్ట్ర అధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీలో డీజిల్ అవినీతి పై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






